పడవ బోల్తా .. 26 మంది మృతి
కరీబియన్ దీవుల్లోని హోండురస్ దేశంలో పడవ బోల్తా పడింది.
ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు.
వాతావరణం సరిగా లేని కారణంగా.. సముద్ర పీతలను పట్టే జాలర్ల బోటు మునిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం నుంచి మరో 47 మందిని రక్షించారు.
కరీబియన్ తీరంలోని మాస్కిటా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
లాబ్‌స్టర్ ఫిషింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో అక్కడ జాలర్లు మళ్లీ చేపల వేటకు వెళ్లారు.
70 టన్నుల బరువు ఉన్న బోటు మునిగినట్లు చెప్పారు.
అయితే ప్రమాదానికి కారణంగా ఇంకా తెలియరాలేదు.
Comments
Post a Comment