ఆసక్తి పుట్టిస్తున్న బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో వాళ్లు కూడా..

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఇంకా మొద‌లే కాలేదు కానీ మొద‌ల‌య్యే ముందే రోజుకో కొత్త సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవ‌రనే ప్రశ్నలకు తెరతీస్తూ నాగార్జున అని కన్ఫర్మ్ చేసారు. ఈ మద్యే విడుదలైన ప్రోమో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఇక ఇప్పుడు అసలైన ఆసక్తి కంటెస్టెంట్లపై ఉంది. ఓ సారి రేణు దేశాయ్ వ‌స్తుంద‌నే వార్త‌లు వస్తే.. మరోసారి మాధవిలత అంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సారి హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. 

ఒక్కరో ఇద్దరో కాదు.. ఈ సారి అంతా పేరున్న వాళ్లనే ఇంట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఈ సారి కనిపిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్ద‌రు సంచ‌ల‌న తార‌ల పేర్లు మాత్రం ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి. తెలుగు మీడియాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ వార్త‌లు సావిత్రి ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌త సీజ‌న్‌లో యాంక‌ర్ శ్యామ‌ల వెళ్లింది. ఈ సారి సావిత్రి వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా ఈ సారి లిస్టులో ఉంది. 

యాంకర్ శ్రీముఖితో పాటు ఒకప్పుడు వరస విజయాలతో ఇండస్ట్రీని ఊపేసిన లవర్ బాయ్ తరుణ్ కూడా ఈ సారి ఇంట్లోకి వస్తున్నాడని తెలుస్తుంది. ఆయనకు తోడుగా మరో హీరో వరుణ్ సందేశ్, కొరియోగ్రఫర్ రఘు మాస్టర్, గాయని శ్రావ‌ణ భార్గ‌వి భ‌ర్త‌ హేమచంద్ర, యూ ట్యూబ్ సెన్సేషన్ గాయత్రి గుప్తా, సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. టిక్ టాక్ సెన్సేష‌న్ ఉప్ప‌ల్ బాలు కూడా ఈ సారి హౌజ్ మేట్స్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది.

క‌మెడియ‌న్ వైవా హర్ష, యాంక‌ర్ జాహ్నవి, పొలిటికల్ కమెడియన్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ కూడా ఇంటి సభ్యులుగా పంపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జులై చివర్లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. 100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్‌లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?