కూరగాయలకు రూ.30 అడిగిందని... భార్యకు తలాక్ చెప్పిన భర్త

నోయిడాలో విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. కూరగాయలు కొనేందుకు రూ.30 అడిగిందని భార్యకు ఓ భర్త విడాకులిచ్చిన ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల జైనబ్‌పై ... భర్త సాబిర్... భార్యభర్తలు. శనివారం సాయంత్రం జైనబ్‌పై భర్త అత్తమామలతో పాటు... బావలు, ఆడపడుచులు కూడా ఆమెపై దాడికి దిగారు. ఓవైపు భర్త తరపు బంధువులు కొడుతుంటే... భర్త సాబిర్ జైనబ్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడికి దిగాడు. అంతేకాదు ఆమెకు కరెంట్ షాక్ కూడా ఇచ్చాడు. ఆ క్షణమే తన ముఖాన మూడుసార్లు తలాక్ చెప్పి ఇంటినుంచి గెంటివేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇంతకుముందు కూడా తన సోదరిపై అనేకసార్లు భర్త తరపు బంధువులు దాడి చేశారని జైనబ్ సోదరుడు రషీద్ ఆరోపించాడు. గతంలో తన జువెలరీ ఇవ్వలేదని అ్తత్త కూడా తన సోదరిని తీవ్రంగా కొట్టిందన్నాడు. జైనబ్‌ అనారోగ్యం గురైతే.. భర్త పుట్టింటకి పంపించి విడాకులు ఇస్తామని బెదిరించేవాడని బాధితురాలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బాధితుల ఫిర్యదుతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త సాబెర్ కుటుంబంపై 498ఏ,,504,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సాబిర్‌‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే జూన్ 30న సాబిర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అతడి కుటుంబసభ్యులపై కూడా కేసులు నమోదు చేసిన వారంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మిగతా విషయాలన్నీ కూడా ఫ్యామిలీకోర్టులో తేలుతాయన్నారు. అయితే ప్రస్తుతం జైనబ్ తన పిల్లలతో సహా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?