34 మందిని కాపాడిన డ్రైవర్..
ప్రకాశం
ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను అసువులుబాశాడు. ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి పొదిలి నుంచి బయలుదేరిన బస్సుకు డ్రైవర్. బస్సు బయలుదేరి దొనకొండకు చేరుకుంటున్న సమయంలో అతని ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. అంత బాధలోనూ ఇమ్మాన్యుయేల్ సమయస్ఫూర్తిగా ఆలోచించాడు. బస్సును పక్కకు నిలిపి తాను కూర్చున్న సీటులో ప్రాణాలు వదిలాడు. బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులను కాపాడాడు. బస్సును డ్రైవర్ ఆపకపోయి ఉంటే రోడ్డు ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఇమ్మాన్యుయేల్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు.
Comments
Post a Comment