కళాశాలల్లో 3 వేలకు పైగా పెండింగ్ లో ఉన్న జూనియర్‌ అధ్యాపకుల పోస్టులు

విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3 వేలకు పైగా పెండింగ్ లో ఉన్న జూనియర్‌ అధ్యాపకుల పోస్టులను తక్షణం భర్తీచేయాలని ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేశారు.

ఆందోళనలో భాగంగా విజయవాడలో పీబీ సిద్ధార్థ జూనియర్‌ కళాశాల వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులచే తరగతులను బహిష్కరింపజేశారు.

గత ప్రభుత్వం జూనియర్‌ అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తామని కమిటీలు వేసి అయిదు సంవత్సరాలు కాలయాపన చేసిందని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అదే దారిలో వేళ్తోందని వ్యాఖ్యానించారు.

తక్షణం జూనియర్‌ అధ్యాపకుల ఖాళీలు భర్తీచేయకపోతే... గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి పడుతుందన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?