లిబియా దేశంలో మంగళవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మరణించగా,మరో 80 మంది గాయాల పాలయ్యారు. 

ట్రిపోలి ( లిబియా) :

లిబియా దేశ రాజధాని ట్రిపోలి సమీపంలోని తజౌరా సబర్బన్ ప్రాంతంలోని వలసదారుల కేంద్రంపై మంగళవారం రాత్రి వైమానిక దాడి జరిగింది.

ఈ దాడిలో 40 మంది మరణించారని వార్తా సంస్థలు వెల్లడించాయి. మరో 80 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

లిబియాలో నియంత గడాఫీ మృతి అనంతరం రెండు గ్రూపులుగా విడిపోయి పోరు సాగుతోంది.

మంగళవారం రాత్రి జరిగిన వైమానిక దాడిని లిబియా దేశ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ధ్రువీకరించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?