ఒక్క బిర్యానీ రూ.40 వేలు
చెన్నై: ఒక్క బిర్యానీ రూ.40 వేలా. అంత ఖరీదా! అని ఆశ్చర్యపోతున్నారా. అయితే ఆ బిర్యానీ వెనకున్న మోసం గురించీ చదవండి. చెన్నైలోని షావుకారుపేటలో ఉండే ప్రియ ఓ కళాశాల విద్యార్థిని. ఆమె సెల్‌ఫోన్ చూస్తుండగా ఓ ఫుడ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం రూ.76కే బిర్యానీ అందిస్తామన్నది దాని సారాంశం. ఆ నోటిఫికేషన్‌ని చూసిన వెంటనే ప్రియ.. బిర్యానీ ఆర్డర్ చేసింది. ఎంతసేపు వేచి ఉన్నా బిర్యానీ మాత్రం రాలేదు. దీంతో యాప్ వాళ్లకు ఫోన్‌చేసి.. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరింది. రూ.76 తక్కువ మొత్తం కనుక ఆన్‌లైన్‌లో వెనక్కి ఇవ్వలేమని వాళ్లు చెప్పారు. రూ.5 వేలు నగదు జమచేస్తే.. తిరిగి రూ.5,076 ఒకేసారి పంపిస్తామని నమ్మబలికారు. అది నమ్మిన ప్రియ రూ.5 వేలు పంపింది. అయినా వాళ్లు డబ్బులు పంపించలేదు. మరింత నగదు జమచేయాలని కోరారు. అలా ఆమె నుంచి రూ.40 వేలు దోచుకున్నారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది
Comments
Post a Comment