నేపాల్ లో భారీ వరదలు… 50 మంది మృతి
ఖాట్నాండు:
నేపాల్ భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలతో పలు ప్రాంతాలు మునిగిపోయాయి.
వరదల ధాటికి కొండచరియలు విరిగిపోయాయి. ఈ భారీ వర్షాల ధాటికి ఇప్పటివరకు 50 మంది దుర్మరణం చెందగా 25 మంది గల్లంతయ్యారు.
ఈ విపత్తులో 28 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం 1100 మంది రెస్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
వరద ప్రాంతాల నుంచి 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ వెల్లడించింది.
కొండ చరియలు విరిగిపోవడంతో పలు వరద ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Post a Comment