58 ఉంటే... 74 మందిని కేటాయించాం... చంద్రబాబు భద్రతపై ఏపీ ప్రభుత్వం

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కేటాయిస్తున్న భద్రతపై ఏపీ హోంమంత్రి సుచరిత వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు భద్రత తగ్గించినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని తెలిపిన సుచరిత... రూల్స్‌లో ఉన్న దానికంటే ఎక్కువగానే ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం చంద్రబాబుకు 58 మంది సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా... తాము మాత్రం 74 మంది సిబ్బందిని కేటాయించామని వివరించారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయించామని తెలిపారు. 

తనకు భద్రత తగ్గించారని ఆరోపించిన చంద్రబాబు... తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు ఇప్పటికీ తాను ముఖ్యమంత్రిని అనే భావనలో ఉన్నారని... ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతి అంశానికి రాజకీయరంగు పులమడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేత ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఎక్కడ భద్రత కల్పించరని...కానీ తాము మాత్రం ఆయన ప్రైవేటు ఆస్తులకు కూడా భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?