రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి బాధితులకు ఈ మొత్తాన్ని ఇప్పిస్తారు. ఈ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందక గడువు చెల్లిపోయింది. దీంతో మళ్లీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం అందించే మంచి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం తదితర కొత్త నిబంధనలను బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలిగిస్తోందని తృణమూల్‌ ఎంపీలు ఆరోపించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?