రాష్ట్రంలోని 96 పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనుంద

అమరావతి

రాష్ట్రంలోని 96 పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనుంది.

వీటిలో ప్రత్యేక అధికారుల నియామకానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేడు జీవో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

వీటిలో 94 చోట్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు.

ప్రభుత్వ తదుపరి ఆదేశాలపై వార్డుల వారీగా పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.

సంయుక్త కలెక్టర్లు, ఉప కలెక్టర్లు, ఐటీడీఏ పథక బాధ్యులు, రెవెన్యూ డివిజన్‌ అధికారులు (ఆర్డీవో)లను అత్యధిక చోట్ల పురపాలక ప్రత్యేకాధికారులుగా నియమించడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?