ప్రాణాలు కాపాడే వైద్యులకు ఓ రోజు..

ఏదైనా అనారోగ్యంగా ఉంటే చాలు డాక్టర్స్ దగ్గరికి పరుగెడతాం.. ఆ సమయంలో వారినే దైవంగా భావించి ఆరోగ్యాన్ని కాపాడమని వేడుకుంటాం. ఆరోగ్యాన్ని మించిన ఆనందం మరోటి ఉండదు.. ఆ ఆరోగ్యాన్ని కాపాడేవారే వైద్యులు. అందుకే అంటారు వైద్యో నారాయణ హరి అని. జబ్బులు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యులే తిరిగి ప్రాణాలు పోస్తారు. నిజానికీ ప్రపంచంలో వైద్య వృత్తికి ఎంతో గుర్తింపు, గౌరవం ఉంటుంది. రోగి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తారు. ముఖ్యంగా.. ఉదయం మొదలు రాత్రి పడుకునేవరకూ.. అవసరమైతే పడుకున్న సమయాల్లోనూ ఎప్పుడూ ఏ సమయంలోనైనా సరే.. రోగులకి సేవచేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని కూడా వారు నిర్వర్తిస్తూ రోగి ప్రాణాలు కాపాడుతుంటారు.

అసలు వైద్యుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. గతంలో డాక్టర్ బీసీ రాయ్ వైద్యరంగంలో ఎన్నో సేవలు చేశారు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారు. ఆయన జీవితమంతా ప్రజల ప్రాణాలను కాపాడేందుకే కృషి చేశారు కాబట్టి.. ఆయన అందించిన విశిష్ఠ సేవలకు గుర్తుగానే జూలై 1వ తేదీని డాక్టర్స్ ‌డేగా జరుపుకోవాలని ప్రకటించారు.

అయితే, అన్నిరంగాల్లోనూ ఇబ్బందులు ఉన్నట్లుగానే వైద్య రంగాల్లో సేవలందించే వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేక ఉన్నవారినే అధికారులు పనిగంటలు పెంచుతున్నారు. దీంతో వైద్యులపై పనిఒత్తిడి పెరుగుతుంది. ఇవే కాకమరిన్నిసమస్యలతో చాలా చోట్ల వైద్య సిబ్బంది ఇబ్బందులుపడుతున్నారు. వీరి సమస్యలను తీర్చేందుకు అధికారులు కచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?