ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖి
అనంతపురం జిల్లా
గుత్తి పట్టణంలో ని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు.
వైద్యుల హాజరు రిజిస్టర్ పరిశీలించగా వారి విధుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి.
హాజరు రిజిస్టర్లో వైద్యులు సమయానికి రాకముందే వచ్చినట్టు సంతకాలు పెట్టడంపై కలెక్టరు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ధర్మవరం గ్రామనికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రికి రాగా, అతనికి కనీసం వైద్యం చేయకపోవడం తీవ్ర కలవరానికి గురిచేసింది.
గమనించిన కలెక్టరు... వైద్యుల తీరును తప్పుబట్టారు.
వెంటనే ప్రథమ చికిత్స చేసిన సిబ్బంది.. పరిస్థితి విషమించిన పరిస్థితుల్లో ఉన్నత చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలోని పనిచేయని ఎక్స్ రే గదులతో పాటు నియనటల్ వార్డు, పేషెంట్ల వైద్య తీరుపై రోగులను కలెక్టర్ తెలుసుకున్నారు.
సీఎం ఆదేశాల మేరకు విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికి సరైన విధానంలో అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
Comments
Post a Comment