నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే ట్రాఫిక్ పోలీసుల జరిమానా
ముంబయి:
నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే ట్రాఫిక్ పోలీసుల జరిమానా విధిస్తారన్న విషయం తెలిసిందే కదా! అయితే ఈ నిబంధనకు నగర మేయర్లు సైతం మినహాయింపు కాదని నిరూపించింది తాజా ఘటన. వివరాల్లోకి వెళితే.. ముంబయి మహానగర మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ సోమవారం కోల్డోన్‌గరి సమీపాన విలే పార్లే ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడితో కలిసి పర్యటించారు. ఈ సమయంలో మేయర్ అధికారిక వాహనం ఓ ఫుడ్ పాయింట్ ఎదుట నిలిపి ఉంచడం పోలీసులు గమనించారు. అది నో పార్కింగ్ ప్రాంతం కావడంతో వారు తమ విధుల్ని నిర్వర్తించక తప్పలేదు. వెంటనే నిబంధనల్ని ఉల్లంఘించినందకు మేయర్ వాహనం పేరిట చలాన్ జారీ చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఎంత జరిమానా విధించారన్నది మాత్రం తెలియరాలేదు.
గత రెండు వారాల నుంచి ముంబయిలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిగ్నల్ జంపింగ్, మద్యం సేవించి వాహనాల్ని నడపడం, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపడం లాంటి ఉల్లంఘనలకు జరిమానాలను విధిస్తూనే ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు.
Comments
Post a Comment