సాయి నామస్మరణతో మార్మోగుతున్న బాబా ఆలయాలు

నేడు గురు పౌర్ణమి

దేదీప్యమానంగా సాయి ఆలయాలు
బాబా దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

సాయిబాబా ఆలయాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. గురుపూర్ణిమను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు.

మహారాష్ట్రలోని షిరిడీసాయిబాబాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చారు.

వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా మారాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?