పొలంలో యువతి టిక్ టాక్ వీడియో... చెరువులో పడి

టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం టిక్ టాక్ అనేది ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారిపోయింది. దీంతో కొందరు యువతీ యువకులు ఈ పిచ్చిలో పడిపోయి తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. తాాజగా కర్నాటకలో ఓ డిగ్రీ విద్యార్థిని టిక్ టాక్ వీడియో చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బెంగళూరుకు 75 కిలోమీటర్ల దూరంలో కోలార్ ప్రాంతం ఉంది. అక్కడ మాలా 20 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి ఉంటుంది. బీఏ ఫైనలియర్ చదువుతున్న మాలా తెలివైన విద్యార్థిని. అయితే మాలాకు టిక్ టాక్ వీడియోలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ఆ ఇష్టంతోనే.. పొలంలోకు వెళ్లిన మాలా... సిినిమాలో ఓ సీన్‌కు టిక్ టాక్ చేస్తోంది. ఇంతలో తన వెనకాలే ఉన్న చెరువు ఉందన్న విషయం గమనించలేకపోయింది. టిక్ టాక్ చేస్తూ చెరువులో పడిపోయింది. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఈత రాని మాల అందులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాలా చాలా బాగా చదివేదని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఆమె చదువుకు ప్రశంసగా మొన్ననే రూ. 10,000 రూపాయల స్కాలర్‌షిప్ కూడా వచ్చిందని కాలేజ్ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. టిక్ టాక్ వీడియోలపై మోజుతో అనవసరంగా తమ ప్రాణాలు బలితీసుకోవద్దని మాల తల్లిదండ్రులతో పాటు.. ఉపాధ్యాయులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 

కొన్నిరోజుల క్రితం ఇలాంటి ఓ ఘటనే కర్నాటకలో జరిగింది. టిక్ టాక్ వీడియో కోసం స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు తన మెడ విరుచుకున్నాడు. ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొందతూ అతడి మరణించాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?