ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్ తీసుకున్న సీఎం జగన్

ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి , సంతనూతలపాడు ఎమ్మెల్యేలకు జగన్‌ క్లాస్‌ తీసుకున్నారు. తమ గెలుపులో కీలక పాత్ర పోషించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డిని అవమానించేలా వ్యవహరించడంతో జగన్‌ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. దర్శి టికెట్‌ బూచేపల్లికి ఇచ్చేందుకు జగన్ సిద్ధపడినా బూచేపల్లి శివప్రసాద రెడ్డి పోటీకి విముఖత చూపారు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దర్శి టికెట్ ఇచ్చారు. వేణుగోపాల్‌ గెలుపుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన వర్గం పూర్తి స్థాయిలో పనిచేశారు. సంతనూతలపాడు విషయంలోనూ బూచేపల్లి పనిచేశారు. సొంత డబ్బు కూడా ఖర్చు చేసి సుధాకర్ బాబు గెలుపునకు కృషి చేశారు.

అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దూరం పెడుతూ వచ్చారు. వేణుగోపాల్ ఒక అడుగు ముందుకేసి బూచేపల్లి దగ్గర నుంచి సిఫార్సులు తీసుకురావాల్సిన అవసరం లేదు… ఏదైనా కావాలంటే నేరుగా తన వద్దకే రావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో దర్శి నియోజకవర్గంలో పోలీసు అధికారులు కూడా తాను చెప్పిన వారే ఉండాలన్నట్టు  వేణుగోపాల్ వ్యవహరంచినట్లు కూడా తెలుస్తోంది.

మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా సంతనూతలపాడులో బూచేపల్లి వర్గాన్ని దూరంపెడుతూ ఎమ్మెల్యే అనే దర్పాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు తన పట్ల ఇలా వ్యవహరించడాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి దృష్టికి బూచేపల్లి శివప్రసాదరెడ్డి తీసుకెళ్లారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని జగన్ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది. మీ గెలుపునకోసం పనిచేసిన వ్యక్తి పట్ల ఇదేనా మీరు చూపే కృతజ్ఞత అంటూ జగన్ వ్యాఖ్యానించారు. శివప్రసాదరెడ్డిని కలుపుకుని ముందుకెళ్లాల్సిందేనని స్పష్టంగా జగన్ చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?