జీరో బడ్జెట్ వ్యవసాయం పై దృష్టి ....

ఢిల్లీ  వ్య‌వ‌సాయ‌రంగంలో ప్రైవేటు వ్యాపారుల‌ను ప్రోత్స‌హించ‌నున్నారు.

వ్య‌వ‌సాయ రంగానికి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించే అంశంపై మోదీ స‌ర్కార్ దృష్టి పెట్టిన‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలిపారు.

ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ ఆమె మాట్లాడారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, ఈజ్ ఆఫ్ లివింగ్‌.. రైతుల‌కు కూడా చెందాల‌న్నారు.

జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాన్ని రైతులు ఆశ్ర‌యించాల‌న్నారు. రైతుల‌కు ఇది కొత్త మోడ‌ల్‌గా ఉండాల‌న్నారు.

దీంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద‌న్నారు. నీటి నిర్వ‌హ‌ణ చూస్తున్న మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ఏకం చేసి జ‌ల‌శ‌క్తి మంత్రాల‌యాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు.

ప్ర‌తి ఇంటికి 2024లోగా నీటి అందించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌ల‌శ‌క్తి శాఖ కోసం నిధుల‌ను స‌మీకిరిస్తున్నామ‌న్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు 9.6 కోట్ల మ‌రుగుదొడ్లు నిర్మించామ‌న్నారు. 5.6 ల‌క్ష‌ల గ్రామాలు బ‌హిర్భూమి నుంచి విముక్తి పొందాయ‌న్నారు.

సుమారు 2 కోట్ల గ్రామీణ ప్ర‌జ‌లు డిజిట‌ల్ అక్ష‌రాస్యత సాధించార‌న్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?