ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు ముంబయి మహానగరాన్ని అస్తవ్యవస్తం చేశాయి.

ముంబయి:

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు ముంబయి మహానగరాన్ని అస్తవ్యవస్తం చేశాయి. అయితే ఇంత భారీ వర్షాలు వచ్చినా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయకపోవడంపై ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. దీనిపై స్పందించిన భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వారి లోపాన్ని అంగీకరించింది. ఆదివారం నాటికే వర్షాలు ప్రారంభమైనప్పటికీ సోమ, మంగళవారాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేయలేకపోయామని ఐఎండీ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో నగరంలో సుమారు 375.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దశాబ్ద కాలంలో నమోదైన వర్షాపాతాల్లో ఈసారే అత్యధికం.
సోమవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ వర్షాలు అంతకంతకూ పెరుగుతుండడంతో హెచ్చరికల్లో మార్పులు చేస్తూ వచ్చింది. ఎప్పుడూ కచ్చితమైన సమాచారం మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో ఐఎండీ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ‘‘భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని మేం సోమవారం హెచ్చరికలు జారీ చేశాం. కానీ, మరీ ఆ స్థాయిలో వస్తాయని అంచనా వేయలేకపోయాం. పరిస్థితిని గమనించి ఎప్పటికప్పుడూ సూచనలు జారీ చేస్తూనే ఉన్నాం. గతంలో విరామం ఇస్తూ వర్షం కురిసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి ఎడతెరపి లేకుండా ఆరు గంటలు ఏకధాటిగా వర్షాలు కురవడమే విపత్తుగా మారింది’’ అని ఐఎండీ పశ్చిమ మండలం డైరెక్టర్ హోసలికర్ తెలిపారు. మరోవైపు వాతావరణ మార్పులను అంచనా వేయడంలో ప్రస్తుతం భారత్‌ అనుసరిస్తున్న విధానాల్లో లోపాలున్నాయని నిపుణులు ఆరోపిస్తుండడం గమనార్హం.
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబయి నగర వీధులన్నీ జలమయమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలకు సైతం ఆటంక ఏర్పడింది. వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?