ప్రొద్దుటూరు పట్టణంలో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి.

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి.ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని బుడ్డాయిపల్లెలో నివాసముంటున్న మైలవరం పంచాయతీరాజ్‌ ఏఈఈ పల్లా సుబ్బయ్య ఇంటిపై మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. కర్నూలులోని ఏసీబీ కోర్టు ఇచ్చిన సెర్చ్‌ వారెంట్‌తో కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణం బృందం ఏఈఈ ఇంట్లో సోదాలు చేపట్టారు. పట్టణంలోని ఏఈఈ బంధువుల ఇళ్లల్లో నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేశారు. సోదాల్లో 658 గ్రాముల బంగారు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఏఈఈ భార్య పేరిట పది ఇళ్ల ప్లాట్‌లు, ఏఈఈ పేరిట రెండు ఇళ్ల ప్లాట్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులే. వీటి మొత్తం రూ.2 కోట్లవరకు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుబ్బయ్యను అరెస్టు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?