జగన్‌పై కాంగ్రెస్ నేత విమర్శలు
విజయవాడ: సీఎం జగన్‌పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు జగన్‌కు లేదన్నారు. కేసీఆర్ మాయలో పడి జగన్ ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. జగన్‌ను కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరానికి వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్.. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులు ఏపీకి జీవనాడులని వివరించారు. కేసీఆర్ కృష్ణమ్మను బంధించారు, గోదావరిని బంధించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గోదావరిలో మిగులు, నికర జలాలు వాడుకునే అర్హత ఏపీకి మాత్రమే ఉందని తెలిపారు. గోదావరి నీళ్లు దోచుకునేందుకే కేసీఆర్ పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని వెల్లడించారు.
Comments
Post a Comment