అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్...
న్యూఢిల్లీ
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసు తీర్పును జులై 17న వెల్లడించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం.
ది హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసుఫ్.
గూఢచర్యం ఆరోపణలతో 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్ ఏజెంట్లు అపహరించారు.
ఆ తర్వాత బలూచిస్థాన్‌లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.
అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్...
అనంతరం ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్ అపహరించిందని భారత్ తెలిపింది.
పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్.
2017 మే 18న ఆయన మరణశిక్షపై స్టే విధించింది కోర్టు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.
Comments
Post a Comment