‘తన అవినీతి బురదను టీడీపీకి అంటించడమే జగన్ లక్ష్యం’
అమరావతి :
తన అవినీతి బురదను తెలుగుదేశం పార్టీకి అంటించడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మాజీమంత్రి నారాయణ పేర్కొన్నారు.
గురువారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ...
అర్బన్ హౌసింగ్‌లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు రూ. 1,546- రూ. 1,651 మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు.
చదరపు అడుగుకు రూ.2,300కు పెంచారనేది అవాస్తవమని నారాయణ అన్నారు.
2004-14 మధ్య ఇళ్ల నిర్మాణంలో రూ. 5 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు.
Comments
Post a Comment