‘ప్రేమ పావురాలు’  ఫేం భాగ్యశ్రీ భర్త  అరెస్ట్‌

ముంబై : ప్రేమ పావురాలు కథానాయిక, అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌  భాగ‍్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 గ్లాంబింగ్‌ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త   అయిన హిమాలయాను అంబోలి పోలీసులు  నిన్న (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు.  

అనంతరం బెయిల్‌ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

కాగా  మేనే ప్యార్‌ కియా ( ప్రేమ పావురాలు)  అనే  తొలిచిత్రం తోనే భాగ్యశ్రీ బాగా పాపులయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు.

చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె చిత్ర సీమకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి  ఇద్దరు సంతానం.

 కుమారుడు  అభిమన్యు దాసాని ‘మర్ద్‌  కో దర్ద్‌ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?