వైఎస్ సన్నిహితులకు కానుకలు

విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి గంగాధరస్వామికి శుక్రవారం కొరియర్‌ అందింది. ఈ కొరియర్‌ బాక్స్ తెరిచి చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.అందులో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దర్ పంచె.. చొక్కాతో పాటు.  ఓస్వీట్ బాక్స్.. వైఎస్ ఫోటో ఉన్నాయి. దీంతో ఇలా కానుకలు అందుకున్న వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వైఎస్‌ను గుర్తుచేశారంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ కానుకలన్నీ షర్మిలరెడ్డి పేరుతో కొరియర్‌లో అభిమానులకు అందివ్వడం జరిగింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జులై 8న ఈసారి ఆయన కుటుంబసబ్యులు వినూత్నంగా నిర్వహించారు. వైఎస్ జగన్ సీఎం కావడతో తండ్రి వైఎస్ఆర్ పుట్టినరోజైన జూలై 8న ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయిత అదే రోజు తండ్రి వైఎస్ అభిమానులకు అనుకోని ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్ అభిమానుల్లో కొందరికి అరుదైన కానుకలు అందించింది. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు ఈ కానుకలు పంపించినట్లు సమాచారం.  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే పలువురికి ఈ కానుకలు అందాయి.

ఏపీ, తెలంగాణలో ఎంపిక చేసిన 30 మంది వైఎస్‌ అభిమానులకు అరుదైన కానుకను ప్రత్యేకంగా పంపాలని నిర్ణయించుకున్నారు వైఎస్ కుటుంబసభ్యులు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ధరించిన ఖద్దరు పంచె, చొక్కాలను ఒక్కొక్కరికీ ఒక్కో జత చొప్పున ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి పంపారు. అనుకోకుండా తమక ఇంటికి వచ్చిన ఈ కానుకల్ని చూసినవారి ఆనందానికి అవధులు లేవు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?