మసాజ్ మాటున విదేశీ మహిళలతో వ్యభిచారం.. బట్టబయలైన సెక్స్ రాకెట్ దందా..

అవన్నీ అదిరిపోయే హంగులున్న స్పాలు.. వాటిని చూస్తే వెళ్లి మసాజ్ చేయించుకోవాలని అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక గానీ తెలీదు.. పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ దందా జరుగుతోందని. విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తాజాగా బట్టబయలయ్యాయి. నగరంలోని 14 స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఏకకాలంలో దాడి చేయగా షాక్‌కు గురిచేసే విషయాలు తెలిశాయి. ఈ దాడుల్లో థాయ్‌లాండ్‌తో పాటు పలు దేశాలకు చెందిన చెందిన 25 మంది యువతులు సహా, 35 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.లక్ష నగదు, బీరు బాటిళ్లు, వినియోగించని కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్పాలన్నింటినీ సీజ్ చేసి, నిర్వాహకులను అరెస్టు చేశారు.

14 స్పా కేంద్రాల్లో మూడు స్పాలు సెక్స్ రాకెట్ దందాను జోరుగా నిర్వహిస్తున్నాయని, మిగితావి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పోలీసులు తెలిపారు. వ్యభిచారం గురించి సమాచారం అందితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?