బాలికపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు
కర్నూలు:
బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో బాలిక ప్రసవించింది.
కానీ శిశువు మృతి చెందింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment