తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణ పడుతున్న ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. బుర్ద్వాన్ పట్టణంలో శుక్రవారం ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడటంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
Post a Comment