కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బెంగళూరు

 కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారని, దేవెగౌడ కూడా కుమారస్వామికి అదే సూచించారని ప్రచారం జరిగింది. కేబినెట్‌ భేటీలో కుమారస్వామి అదే నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై కుమారస్వామి కాస్త ఘాటుగా స్పందించారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితే 2010లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తలెత్తిన సంగతి తెలుసు కదా అప్పుడు ఆయన రాజీనామా చేశారా? రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని కుమారస్వామి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. కేబినెట్ భేటీ అనంతరం కుమారస్వామి గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలిసింది. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?