ఏపీ అసెంబ్లీలో స్వరం పెంచిన టీడీపీ... ప్రతిపక్షం డిమాండ్ ఏంటంటే...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష టీడీపీ విత్తనాల కొరత అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. వెంటనే దానిపై చర్చించాలని ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నప్పుడు డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుని, కావాలనే టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బీఏసీలో నిర్ణయించినట్లుగానే సమావేశాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం కరువుపై చర్చిద్దామని మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో... అధికార పక్షం చెప్పినదే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. స్వయంగా స్పీకరే జీరో అవర్ తర్వాత చర్చిద్దామని స్పష్టం చెయ్యడంతో... తొలి బడ్జెట్ సమావేశాల రోజే గందరగోళం ఎందుకనుకున్నారో ఏమో గానీ... టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. దాంతో కరవుపై చర్చ జరుగుతోంది.
మరోవైపు నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు. శాసనమండలి సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కానున్నాయి
Comments
Post a Comment