కాళేశ్వరం కట్టినప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా... సీఎం జగన్ ఫైర్...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే... కరవు, ప్రాజెక్టులపై జరుగుతున్న చర్చ మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధానంగా... చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం పెంచారన్న సీఎం వైఎస్ జగన్... ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలు బాగా తగ్గిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ ప్రశ్నించడాన్ని... టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ పట్ల సానుకూలంగా ఉండటం వల్లే... ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే మంచిదే అన్నారు. ఐతే... గాడిద అని జగన్ అనడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. తాను సామెత చెప్పానన్న జగన్... అలా చెప్పడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు.

గోదావరిపై క్లాస్ పీకుతాన్న సీఎం జగన్... గోదావరి ప్రవాహం, పాయలపై వివరించారు. ఈ సందర్భంగా... ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఉండదని జగన్ వ్యాఖ్యానించడం సభలో కలకలం రేపింది. దీనిపై స్పందించిన మాజీ సీఎం చంద్రబాబు... నా రాజకీయ అనుభవం అంత వయసు మీకు (జగన్)కి ఉంది అంటూ మాట్లాడిన చంద్రబాబు... సీఎం జగన్... అధికారం వచ్చింది కదా అని విర్రవీగడం కరెక్టు కాదన్నారు. అసెంబ్లీలో తన నోటిని మూయించగలరన్న చంద్రబాబు... ప్రజల నోరు మూయించలేరని అన్నారు. భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తే ఊరుకునేది లేదనడంతో... అధికార పార్టీ కూడా బలంగా తిప్పికొట్టింది. సభలో గందరగోళం ఏర్పడింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?