హోంమంత్రి అమిత్‌షా తొలిసారిగా శనివారం నగరానికి వస్తున్నారు.
హైదరాబాద్
రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా తొలిసారిగా శనివారం నగరానికి వస్తున్నారు.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది.
అమిత్‌షా సమక్షంలో పలువురు పార్టీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది.
ఇందుకోసం ఆయా పార్టీల్లో అసమ్మతి నేతలు, తటస్థులతో బీజేపీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. అయితే వీరి చేరికపై ఇంకా స్పష్టత రాలేదు.
శనివారం శంషాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు.
దీని కంటే ముందు ఆయన సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి రంగనాయకతండాలోని గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకుటుంబానికి పార్టీ సభ్యత్వం అందజేస్తారు.
అక్కడ వారి కుటుంబ సభ్యులతో కలిసి ‘ఛాయ్’ తాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒక మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది.
Comments
Post a Comment