టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్ ...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
నాటి నుంచి నేటి వరకు టీడీపీలో బడా నేతలుగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కమలం పార్టీ కండువాను భూజాన వేసుకుంటున్నారు.
అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
అయితే వీరిలో కొందరిని చంద్రబాబు నాయుడు బీజేపీ లో చేర్పించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎప్పటినుంచో బీజేపీలోకి ఫిరాయించిన కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు బినామీలుగా వ్యవహరించారని అందుకే వారిని చంద్రబాబు బీజేపీ ఉంచే స్కెచ్ వేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక సాధారణ ప్రజలు మాత్రం బీజేపీలో చేరిన ప్రతీ టీడీపీ నాయకుడు తమ కాంట్రాక్టుల వ్యవహారాలను కాపాడుకోవడానికే పార్టీని ఫిరాయించారని ప్రజలు భావిస్తున్నారు.
ఇక వీరితో పాటు మరికొద్దిరోజుల్లో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న చింతమనేని ప్రభాకర్ పేరు కూడా వినిపిస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ప్రవర్తించారో అందరికి తెలిసిందే. మహిళా అని చూడకుండా ప్రభుత్వ అధికారి వనజాక్షిపై దాడి చేసిన సంఘన రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చి పోలేరు.
దానితోపాటు ఆయన పై కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఒక కేసుకు శిక్ష కూడా ఖరారు అయింది.
ఇక మిగిలిన కేసులను కదిలిస్తే ఆయన ఖచ్చితంగా కటకటాల్లో వెళ్లె అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి,
అందుకే చింతమనేని చాలా కాలంగా పార్టీ దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవలే టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కూడా హాజరుకాలేదు.
ఇవన్ని పరిశీలిస్తుంటే త్వరలో చింతమనేని ప్రభాకర్ బీజేపీ తీర్థం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Comments
Post a Comment