అమర్ నాథ్ యాత్ర సోమవారం ప్రారంభమైంది.
శ్రీనగర్ :- అమర్ నాథ్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు అనంత్ నాగ్ జిల్లా అభివృద్ధి విభాగం కమిషనర్ ఖలీద్ జహంగీర్ ఈ యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బయల్దేరిన యాత్రికులు సోమవారం బల్లాల్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను ప్రారంభించారు. తొలి విడుతలో 2,234 మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు బయల్దేరారు. 46 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ ఏడాది 1.5లక్షల మంది భక్తులు అమర్ నాథ్ యాత్ర చేసేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యాత్రికులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల హెల్మెట్లకు అమర్చిన సిసి కెమెరాలతో దారి పొడవునా పహారా కాస్తారు. 2017లో అమర్ నాథ్ యాత్రికులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతి చెందారు. దీంతోనే ఈ సారి అమర్ నాథ్ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు...
Comments
Post a Comment