ఇంజనీర్ పై బురద పోసి ... బ్రిడ్జ్ కి కట్టేసిన ఎమ్మెల్యే .
ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్‌కు చేరింది.
కొందరు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో ఊగిపోతున్నారు. ఇటీవల ఇండోర్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే..
మున్సిపల్ ఆఫీసర్‌ను బ్యాట్‌తో కొట్టిన విషయం తెలిసిందే.
తాజాగా గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఓ ఇంజినీర్‌పై బకెట్లతో బురద పోశాడు.
కంకావలి వద్ద ముంబై-గోవా రహదారిపై ఉన్న బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే నారాయణ రాణే, ఆయన మద్దతుదారులు.. ఇంజినీర్ ప్రకాశ్ షెడేకర్‌పై బకెట్ల ద్వారా బురదను పోశారు.
ఆ తర్వాత ఆ ఇంజినీర్‌ను బ్రిడ్జ్‌కు కట్టేశారు. హైవేపై గతుకులు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే, అతని అనుచరులు తమ ఆగ్రహాన్ని ఇంజినీర్‌పై చూపించారు.
Comments
Post a Comment