వ్యవసాయం దండగా కాదు పండగ చేస్తాం. :ఎమ్మెల్యే గంగుల నాని.
శిరువెళ్ల. (మహాదేవపురం)గత ప్రభుత్వ హయాంలో విలయతాండవం చెసిన కరువు ప్రభావం నేడు రైతుల పై చూపకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల భిజేంద్రరెడ్డి(నాని)పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శిరువెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో గత నాలుగు రోజులక్రితం ఆత్మహత్య చేసుకున్న కొట్టే శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారు
కర్నూల్ జిల్లా కలెక్టర్ విరపాండ్యన్ ఎమ్మెల్యే గంగుల భిజేంద్రరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ రైతు ఆత్మహత్య సంఘటన ను తన తన తండ్రి శాసనమండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా తను ముఖ్యమంత్రి. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వర న్యాయనికి కృషిచేసినట్లు పేర్కొన్నారు.
వైఎస్సార్ ప్రభుత్వ లో అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాలిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
రైతులకు భోరు బావులు ఉచితంగా వేసే ఏర్పాట్లు వేగవంతం గా జరుగుతున్నాయన్నారు
రైతులకు పంటల బీమా డబ్బులు ప్రభుత్వమే చెల్లించేందుకు తమ ప్రభుత్వ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రతి రైతు ఆత్మస్థైర్యం తో పంటలసాగు చేపట్టేందుకు వ్యవసాయాన్ని పండగ చేసేందుకు తమ ప్రభుత్వం బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే గంగుల నాని తెలిపారు
ఆళ్లగడ్డ నియోజకవర్గ ములోని ప్రతి రైతు ఆత్మస్థైర్యం తో పంటల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాదించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు తరుచు తగిన సూచనలు సలహాలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు..
ఈ కార్యక్రమంలో.వ్యవసాయ శాఖ డిడి శ్రీనివాసరావు ఆర్డీఓ నారాయనమ్మ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ నాగరాజు ఎస్సై తిమ్మారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ హాక్.vro శ్రీకాంత్ ఇతర అధికారులు
వైసీపీ నాయకులు కంపరాజు రాజేష్ గౌడ్.నరహరి.అబ్దుల్ సలాం.నజీర్ మందాల శివారెడ్డి. సుబ్బరాయుడు జింకల నాగన్న.నాగభూషణం రెడ్డిఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment