మంచినీటి కుళాయివద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా

సోంపేట మండలంలోని స్థానిక పల్లివీధిలో మంచినీటి కుళాయివద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపూడి పద్మ(38) మంచినీటిని పట్టుకునేందుకు కుళాయివద్ద క్యూలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు వరుస తప్పడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తగాదాలో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పద్మ గుండె, తల భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారమందుకున్న సోంపేట ఎస్సై కె.వెంకటేశ్‌ సంఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?