నెల్లూరులో ప్రేమోన్మాది దాడి ... ప్రేమించలేదని బాలిక ఇల్లు తగలబెట్టాడు

నెల్లూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఏకంగా అమ్మాయి కుటుంబాన్నే టార్గెట్ చేశాడు. ప్రేమించిన బాలిక ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నెల్లూరు చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలోని రమేష్ రెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వంశీ కృష్ణ అనే యువకుడు పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పగా.. తిరస్కరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన వంశీ.. బాలిక ఇంటికి నిప్పు పెట్టి వారిని అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఓ రోజు రాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టి పారిపోయాడు. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

తొలుత ఈ ఘటనను షార్ట్ సర్క్యూట్‌గా భావించిన బాధిత కుటుంబం.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిజం తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?