మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన వాయిదా
అమరావతి
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈనెల 8న జిల్లాకు ఆయన వస్తున్నట్లు టీడీపీ జిల్లా నేతలు ప్రకటించారు.
ఈమేరకు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథికి చంద్రబాబు ఫోన్ చేసి పలు విషయాలు చర్చించారు.
ఇందులో భాగంగా ఈనెల 8న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉన్న కారణంగా పలు కార్యక్రమాలకు వైసీపీ ఏర్పాట్లు చేసుకుంటున్నందున పర్యటన వాయిదా వేసుకుంటేనే బాగుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చినుట్లు సమాచారం.
దీంతో ఆయన ఈనెల 10లోగా జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ఈనెల 8 తరువాత బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పనిలో పనిగా చంద్రబాబు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నియామకం విషయం ఏం చేశారంటూ బీకే పార్థసారథిని ఫోన్‌లో అడిగారు.
ఈ మేరకు పార్టీ జిల్లా నాయకులంతా కలిసి ధర్మవరం నియోజకవర్గ పార్టీ శ్రేణులను పిలిపించుకుని ఇన్‌చార్జి నియామకం పై చర్చించామని పార్థసారథి వివరించారు.
అక్కడ గట్టి నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయన్నారు.
చంద్రబాబు ఆదేశాల ప్రకారమే ఇన్‌చార్జి నియామకం చేపడతామని పార్థసారథి వివరించారు.
Comments
Post a Comment