‘సైరా’ కోసం అలా చేస్తున్న రామ్ చరణ్.. చిరంజీవి కోసం తప్పట్లేదు మరి..

  రామ్ చ‌ర‌ణ్ ఏంటి.. యాంక‌ర్ అవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈయ‌న ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ద‌ర్శ‌క‌ధీరుడు అమెరికా టూర్ వెళ్ళ‌డంతో చిన్న బ్రేక్ దొరికింది. దాన్ని కూడా ఇప్పుడు సైరా కోస‌మే వాడేస్తున్నాడు మెగా వార‌సుడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 250 కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు చ‌ర‌ణ్. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో ఖైదీ నెం 150 త‌ర్వాత చ‌ర‌ణ్ నిర్మిస్తున్న సినిమా ఇది. 

పైగా భార‌త తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ కావ‌డం.. అన్నింటికి మించి చిరంజీవికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో చ‌ర‌ణ్ ఎక్క‌డా రిస్క్ తీసుకోవ‌డం లేదు. ఎంత బ‌డ్జెట్ అయినా పెట్టేస్తున్నాడు. ఇప్పుడు పెట్టిన దాన్ని వెన‌క్కి తెచ్చుకునే ప‌నిలో ప‌డ్డాడు మెగా నిర్మాత‌. ఇందులో భాగంగానే క‌ర్ణాట‌క రైట్స్ ఏకంగా 32 కోట్ల‌కు అమ్మేసార‌ని తెలుస్తుంది. ఇక అమెజాన్ కూడా 30 కోట్ల‌కు పైగానే బేరం కుదుర్చుకుంది. మిగిలిన బిజినెస్ కూడా భారీగానే జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం యాంక‌ర్ కూడా అవుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. 

సినిమాపై ఉన్న హైప్ ఇంకా పెంచాల‌ని త‌నే హోస్ట్ అయిపోయి ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడు చ‌ర‌ణ్. ఇందులో భాగంగానే తొలి ఇంట‌ర్వ్యూ చిరంజీవి, సురేంద‌ర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత న‌య‌న‌తార, విజ‌య్ సేతుప‌తితో ఒక‌టి.. అమితాబ్, సుదీప్ జోడీగా ఒక‌టి.. ఇలా కొన్ని ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడు ఈయ‌న‌. ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు భారీగానే పెంచేస్తాయ‌ని రామ్ చ‌ర‌ణ్ న‌మ్ముతున్నాడు.

ఇప్ప‌టికే సైరా షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ వేగంగా జ‌రుగుతున్నాయి. చిరంజీవి కూడా డ‌బ్బింగ్ పూర్తి చేసాడు. ఇక మిగిలిన ప‌నులు కూడా వేగంగా పూర్తి చేసి అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. ఈ క్ర‌మంలోనే ఇంట‌ర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈయ‌న‌. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇలా చేస్తే గ‌న‌క ఓ నిర్మాతే యాంక‌ర్ అయిపోయి సినిమాకు హైప్ పెంచ‌డానికి చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం నిజంగానే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో కొత్త శ‌కానికి నాందీ ప‌లికిన‌ట్లు అవుతుందేమో..?

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?