కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ఎంపీ భేటీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్. జహీరాబాద్ నియోజక వర్గంలో రోడ్ల విస్తరణ పై కేంద్ర మంత్రితో ఆయన చర్చలు జరిపారు. భరత్ మాల పరియోజన కింద నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా(NHAI) బోధన్ - రుడ్రూర్ - మడ్నూర్ నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి పై కేంద్ర మంత్రితో చర్చించారు. భోదన్ - మడ్నూర్ జాతీయ రహదారికి సంగారెడ్డి - నాందేడ్ - అకోలా, NH 63 బాంబే - నిజామాబాద్ కు రహదారి లింక్ మిసైందని ఆయనకు తెలిపారు. హైవే 1, హైవే 2, మీడియం, ప్రియారిటీ రోడ్లను NHAI కింద అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రిని బీబీపాటిల్ కోరారు.
33 కిలో మీటర్ల పోడవైన భోధన్ - మడ్నూర్ జాతీయ రహదారికి సంబంధించిన డిపిఅర్ ఇంకా పెండింగ్ లో ఉన్న విషయాన్ని గడ్కరీని కలిసి గుర్తుచేశారు. తాము చేసిన మా విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు బీబీపాటిల్. జహీరాబాద్, రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని అంశాలపై మరింత మంది కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. సోయాబిన్ సమస్యపై త్వరలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ థోమర్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment