మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాయబరేలి ఎంపీ సోనియా గాంధీ తూర్పారబట్టారు.
న్యూఢిల్లీ:
కొందమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలకు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
17వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారంనాడు లోక్‌సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) నవీన భారత దేవాలయాలు (టెంపుల్స్ ఆఫ్ మోడ్రన్ ఇండియా)గా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించేవారని, ఇప్పుడు ఆ దేవాలయాలు చాలామటుకు ప్రమాదంలో పడటం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు.
లాభాలు ఉన్నా ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదని, కొంత మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఉద్యోగులను చిక్కుల్లో నెడుతున్నారని సోనియా ఆరోపించారు.
ప్రభుత్వరంగ టెలికాం కంపెనీల పరిస్థితిని ఆమె వివరిస్తూ 'హెచ్ఏఎల్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్ విషయంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు.
రాయబరేలిలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీని, ఇతర పీఎస్‌యూలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తద్వారా కార్మికులను, వారి కుటుంబాలను గౌరవించాలి' అని ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు.
ఒక ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం, ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) 54,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.
ఆర్థిక ఇబ్బందుల పేరుతో సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనం ఇంకా ఇవ్వలేదు.
Comments
Post a Comment