బీజేపీలోకి టీఆర్ఎస్,కాంగ్రెస్ ఎంపీలు... సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ... తెలంగాణలోనూ బీజేపీ బలం పుంజుకుంటోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కంచుకోటలను బీజేపీ బద్ధలు కొట్టిందని బండారు దత్తాత్రేయ అన్నారు. నిజామాబాద్‌లో కవిత, కరీంనగర్‌లో వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు.
తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలవడంతో 19 శాతం ఓటింగ్ సాధించామని అన్నారు. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌తో పాటు చాలామంది నేతలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో రెవెన్యూశాఖతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని దత్తాత్రేయ ఆరోపించారు.
Comments
Post a Comment