దివి సీమలో వాన గాలి బీభత్సం

కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం

దివి సీమలో వాన గాలి బీభత్సం..!!                            పలుచోట్ల కుప్ప కూలిన చెట్లు. తెగిపడిన విద్యుత్ తీగలు.

సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వానా గాలి బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. గాలివానకు ముందే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేల కూలగా బందలాయిచెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగి పోయాయి. ఒకచోట భారీ వృక్షం 2 బడ్డీ కొట్లుపై పడటంతో ధ్వంసమయ్యాయి. రాక పోకలు స్థంభించడంతో  స్థానికులు చెట్లు నరకి అడ్డు తొలగిస్థున్నారు. అవనిగడ్డ లోని పలు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీటమునిగాయి అవనిగడ్డ తాసిల్దార్ ఆఫీస్ నందు విద్యుత్ వైరు తెగి నీటిలో వేలాడుతుంది తెల్లవారుజామున ఈ ఘటన జరగడం తో పెను ప్రమాదం తప్పింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగడం వలన  విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. సాయంత్రం వరకు మరమ్మతులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?