టీడీపీ పతనానికి దగ్గరగా ఉంది : జీవీఎల్
న్యూఢిల్లీ:
తెలుగుదేశం పార్టీ పతనానికి దగ్గరగా ఉందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలోని ఒకస్థాయి నేతలంతా తమ భవిష్యత్‌పై ఆందోళనగా ఉన్నారని,
చంద్రబాబు నడిపిన కుటుంబ, బానిస రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వివాదం టీడీపీలో అంతర్యుద్ధంగా మారిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment