ట్విట్టర్ లో నారా లోకేష్

జగన్ గారూ! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా చంద్రబాబుగారి మీద యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారు.

మీ తండ్రిగారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగినదానిని వక్రీకరించి చెప్తూ, "నాకు అబద్దాలు చెప్పడం అలవాటే" అని చంద్రబాబుగారు ఒప్పుకున్నట్టు చెప్పారు.

చంద్రబాబుగారి మీద జోకు వేయబోయి, మీ తండ్రిగారి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగిన రూ.400 కోట్ల అవినీతిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

మీరు ఆనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను చదువుకుని వస్తే బాగుండేది. ఆరోజు చంద్రబాబుగారు మాట్లాడింది ఇదిగో చూడండి.

తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం మీ తండ్రిగారి ప్రభుత్వ అవినీతిని బయటపెట్టింది.

ఆ వ్యూహంలో ఇరుక్కుని గిజగిజలాడింది వైఎస్ గారే.

ఇదిగోండి ఆ మరునాడు వచ్చిన పత్రికా కథనాలు. మీ నాయనగారి అవినీతి ధనయజ్ఞం గురించి ఎంత గొప్పగా రాశాయో చదివి తరించండి.

మీ తండ్రిగారి పాలనలో ఏపీలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారు.

కాబట్టి రాష్ట్రంలోనూ, అసెంబ్లీలోనూ ఏం జరుగుతుందో... అది ఇచ్చంపల్లో, ఎల్లంపల్లో తెలుసుకునే అవకాశం లేదు.

ఎవరో చెప్పిన గాలి మాటల్ని పట్టుకుని ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేయకండి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?