పంచాయతీ ఎన్ని "కల"లేనా...!

అమరావతి:

ఆంద్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అసావాహులకు ప్రభుత్వం మరింత ఉత్కంఠ చూపుస్తుంది.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఒక్క రిజర్వేషన్లు మినహా మిగతా ప్రక్రియ అంత అధికారులు రెండు నెలల నుంచి పూర్తి చేశారు.

అన్ని సక్రమంగా ఉంటే గత నెల చివర్లో నోటిఫికేషన్ వస్తుంది అని ప్రచారం జరగగా,ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సహసించడం లేదని విశ్వసనీయ సమాచారం.

సార్వత్రిక ఎన్నికల్లో జోరుగా ఉన్న అధికార పార్టీ,పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని నెలలు ఆగక పంచాయతీ నిర్వహిద్దామని ఉన్నారని భోగట్టా.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎన్నికలు పెట్టని కారణంగా విడుదల కాలేదు.

ఇంకా జాప్యం చెయ్యడం వలన గ్రామాల అభివృద్ధికి కుంటు పడటమే కాకుండా ప్రభుత్వం పై కూడా విమర్శలు వస్తాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎంత తొందరగా పంచాయతీ నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజల్లో అంత మంచి పేరు వస్తుందని క్షేత్రస్థాయిలో ఉన్న అధికార పార్టీ నాయకులు వారి మనసులో మాట తెలియజేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితి లో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో గెలుపు ఒకే విధంగా ఉంటుందని, అధికార పార్టీ పొలిటికల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కొంతమంది వైసీపీ నాయకులు దగ్గర చెప్పారని సమాచారం.

మరి కొద్ది రోజుల్లో పంచాయతీ సంగ్రామం ప్రారంభం అవుతుందని ,జులై చివరి వారంలో నోటిఫికేషన్ కూడా విడుదలైన ఆకాశం ఉందని ,

అమరావతి సర్కిల్లో వినిపిస్తున్న బహిరంగ వార్త,ఎం జరుగుతుందో జులై నెలాఖరు వరకు వేచి చూడాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?