కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు మహిళలపై కత్తితో దాడ

కృష్ణా జిల్లాః  

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు మహిళలపై కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది. వరకట్నం విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా బందరు మండల పరిధిలోని గోకవరం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భార్గవి అనే యువతికి ఆర్నెళ్ల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మహేశ్‌తో వివాహమైంది. వరకట్నం విషయంలో విభేదాల కారణంగా భార్గవి కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. దీంతో అత్తవారింటికి వచ్చిన మహేశ్‌, ఆయన వెంట వచ్చిన మరో వ్యక్తి ఇవాళ ఉదయం భార్గవి కుటుంబసభ్యులతో గొడవపడి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి శారద, శారద తల్లి వరలక్ష్మి, భార్గవి అమ్మమ్మ కాంతమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. శారదకు పొట్టభాగంలో పొడవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. మిగిన ఇద్దరూ మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?