నా ఇంటికొస్తే పాస్ చేస్తా... బాసర త్రిబుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్
నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ బాలికలపై ఓ కీచక్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. విద్యార్థినుల చరవాణిలకు అసభ్యకరంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసేజులు పంపించాడు. ఇంటికి వస్తే... పాస్ మార్కులు వేస్తానని బలవంతం చేశాడు. చదువు నేర్చుకునే విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడు సభ్యసమాజం తలదించుకునేలా చేశారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు గురువుగా మార్గదర్శకంగా నిలవాల్సింది పోయి వారిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఏకంగా కళాశాలలోని వసతిగృహాల లోనే ఉంటూ విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు.
ఈ సంఘటన చదువుల తల్లి కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కళాశాలలో జరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిబుల్ ఐటీ లో విధులు నిర్వర్తించే విభాగాధిపతి రవి వరాల ఆకృత్యాలు తాజాగా వెలుగు చూశాయి. బాసర త్రిబుల్ ఐటీ లో చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల కిందట రెమిడియల్ సప్లిమెంటరీ పరీక్షల నిమిత్తం విద్యాలయానికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మహిళ అధికారి ని దగ్గరకు వెళ్లి బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలని వారితో మాట్లాడి ఇస్తాను అన్నారు.
దీంతో ఆ విద్యార్థిని తన తల్లికి ఫోన్ చేసి ఇవ్వగా మాట్లాడుతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్ కి అసభ్య సందేశాలు వచ్చాయి. ‘నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా, ఇదే నా అడ్రస్. నిన్ను పాస్ చేయిస్తా’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. పరీక్షలలో పాస్ కావాలంటే రాత్రికి నిజామాబాదు లోని తన ఇంటికి రావాలని, రుతుక్రమం తదితర అంశాలతో అసభ్యకర సందేశాలు గమనించిన అధికారిని విద్యార్థిని విచారించారు. ఎవరి సెల్ ఫోన్ నుండి ఈ సందేశాలు వచ్చాయో గుర్తించిన అధికారిని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు విద్యార్థిని మహిళా పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను తమ ఆధీనంలో ఉంచుకుని ఫోన్ ను సీజ్ చేశారు శనివారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మరోసారి విచారించారు.
దీంతో ప్రొఫెసర్ రవి వరాల లీలలు బయటపడ్డాయి, ఈ అధ్యాపకుడిపై చాలా కాలం నుండి ఆరోపణలు ఉన్న ఆర్జీయూకేటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం, రసాయన శాస్త్ర విభాగ అధిపతి గా తన అధికారాన్ని ఉపయోగించి రవి బాలికల వసతి గృహం లోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మిగతా వారికి కేటాయించిన ఎవరు వాటిని వినియోగించుకోలేదు. విద్యార్థినిలకు వేధింపుల విషయమై విద్యాలయ పరిపాలన అధికారి శ్రీహరిని వివరణ కోరగా విద్యార్థినిని తన ఇంటికి రమ్మని ఆమె సెల్ఫోన్కు రసాయన శాస్త్ర విభాగ అధిపతి సందేశాలు పంపాడని పరీక్షలో మార్కులు రావాలంటే డబ్బులు కూడా తీసుకున్నాడని అన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బాసర ఆర్.జి కేటి ఇన్చార్జి ఉపకులపతి అశోక్ మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ రవిని తొలగించాలని.. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆయనపై క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
Post a Comment