రూప్లానాయక్‌కు జైలు శిక్ష

అనంతపురం:

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని బీఈడీ కళాశాల అధ్యాపకునిగా పని చేస్తున్న రూప్లానాయక్‌కు జైలు శిక్ష పడినట్లు ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఏఎస్‌ఐ నాగన్న తెలిపారు. వివాహమైన ఆరేళ్లకే అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని, మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ 2014 సెప్టెంబరులో ఆయన భార్య శ్రీదేవిబాయి ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎక్సైజ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రెహనా రసూల్‌ బాధితురాలి తరపున కోర్టులో వాదించారు. దీంతో నిందితునికి ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?